Thursday, 7 May 2026

Song : నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి

Mother's day 2026 special song
సృష్టిలో అమ్మ ప్రేమ అద్భుతం అనంతం..
నిత్యం బిడ్డలు శ్రేయస్సునే కోరే అమ్మ భూమి పైన నడిచే ప్రత్యేక్ష దైవం.
అందుకే మన పూర్వీకులు కూడా "మాతృదేవోభవ" అనే మాటతో అమ్మకు మొదటి స్థానం ఇచ్చారు.
లోకంలో తల్లులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అక్షర అంజలి.

పాట రచనలో సహకారం అందించిన వెంకోరా అన్నయ్యకు మరియు మనోహర్ K గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Full Lyrical Song on YouTube : నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి

Music & Vocals : Suno AI పల్లవి: నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 1: అమ్మా.. తల్లితనం కోసం తల్లడిల్లి.. ఎన్ని నోములు నోచావో.. ఎన్ని పూజలు చేసావో.. నలుసుగా నీ కడుపున పడితే.. ఎన్ని దీక్షలు చేసావో.. ఎన్ని కష్టాలు కోర్చావో.. పుడమికి నే వచ్చినప్పుడు.. ఎంత మురిసి పోయావో... ఎంత కరిగి పోయావో.. నా తొలి అడుగు పడితే.. ఎంత ఆనందించావో.. ఎంత పరవశించావో.. [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 2: నీ చేతి గోరుముద్దలో.. అమృతం అద్దావు నీ నోట లాలిపాటతో.. నిద్రలో ముంచావు నీ ఒడినే బడిగా మార్చి.. పలుకులు నేర్పావు కంటికి కునుకు లేకనే.. నను కాచుకున్నావు బిడ్డ అడుగు బయట పెడితే.. మనిషి ఇంట్లో.. కనులు వాకిట్లో.. ఆ ఎదురు చూపులకు నే ఎదురైతే.. కోటి కాంతుల తేజాన్ని కళ్ళలో కురిపించావు [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 3: ఆకాశమంత అవధి లేని ప్రేమే నీదమ్మా భూమాతకు సాటి సహనం ఓర్పే నీదమ్మా గంగమ్మలా ఉప్పొంగే అనురాగం నీదమ్మా గాలిలా నను వెన్నంటి ఊపిరి నీవమ్మా అగ్ని తేజస్సుతో నిత్యం యజ్ఞమే నీవమ్మా పంచభూతాలకు ప్రతిరూపమే నీవేనమ్మా ఇలలోన నడయాడే దైవమే నీవేనమ్మా నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నను మోసిన ఓ తల్లి.. నిత్యం నీ మదిలో నను మోస్తావు మళ్ళీమళ్ళీ.. నీ ఋణం తీర్చుటకు ఈ జన్మ సరిపోదు నను కన్న తల్లి.. 07/05/2026

No comments:

Post a Comment