Friday, 29 January 2016

ప్ర‌య‌త్న‌మేవ‌ జ‌య‌తే...

ప్ర‌య‌త్న‌మేవ‌ జ‌య‌తే... 

గంగ‌ను దివి నుంచి భువికి దింపుట‌కు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నా ప‌ట్టువీడ‌క‌ ప‌రిశ్ర‌మించెను బ‌గీర‌ధుడు ‍
               ప్ర‌య‌త్న‌మేవ‌ జ‌య‌తే..

కంటి చూపు కోల్పోయినా త‌న‌లాంటి వారి జీవితాల‌లో బ్రెయిలి లిపితో వెలుగు దారి చూపెను లూయి బ్రెయిలి
               ప్ర‌య‌త్న‌మేవ‌ జ‌య‌తే..

చేతిలో చ‌దువు రేఖ‌ లేద‌న్నారు గురువులు
త‌న‌దైన‌ విశ్వాసంతో సంస్క్రుతానికి భాష్యం ర‌చించెను పాణిని
              ప్ర‌య‌త్న‌మేవ‌ జ‌య‌తే..

ఉద్యోగం కోసం తొక్క‌ని గ‌డ‌ప‌ లేదు.చేతిలో చిల్లిగ‌వ్వ‌ లేకుండా ప్ర‌పంచాన్ని చుట్టి ఎంద‌రికో ఆద‌ర్స‌ప్రాయుడు అయ్యెను వివేకానంద‌
              ప్ర‌య‌త్న‌మేవ‌ జ‌య‌తే...

దేశంకాని దేశంలో ఎంతో మంది క‌న్నీరు తుడుచి, అంద‌రికి అనురాగాలు పంచిన‌ ఆమ్మ‌ థెర్రిస్సా...
             ప్ర‌య‌త్న‌మేవ జ‌య‌తే...

ఊపిరి బిగించి నాకు నాలుగు మాట‌లు మాట్లాడం రాదు  అనెను,దేశాన్ని ఒక‌ త్రాటిపైకి తెచ్చిను గాంధీ...
              ప్ర‌య‌త్న‌మేవ‌ జ‌య‌తే..

వేయిసార్లు అప‌జ‌యం వెక్కిరించినా,వేయినొక్క‌టోసారి ప్ర‌య‌త్నించు
విజ‌యం వ‌రిస్తుంది...
             ప్ర‌య‌త్న‌మేవ‌ జయ‌తే...

విజ‌యీభ‌వ‌
శ్రినివాస‌ చ‌క్ర‌వ‌ర్తి

3 comments:

  1. GOOD CHAKRAVARTHI

    ReplyDelete
  2. ప్ర‌య‌త్న‌మేవ‌ జయ‌తే

    ReplyDelete
  3. ప్ర‌య‌త్న‌మేవ‌ జయ‌తే

    ReplyDelete