Thursday, 28 January 2016

ఎవ‌రిలో ఏ శ‌క్తి దాగి ఉందో...

ఎవ‌రిలో ఏ శ‌క్తి దాగి ఉందో...
గొంగ‌లి అంద‌మైన‌ సీతాకోక‌ చిలుక‌మ్మ‌గా మార‌లేదా...
ఎన్నో ఉలి దెబ్బ‌లు తిన్న‌ రాయి  సుంద‌ర‌మైన‌ శిల్పం కాలేదా.
చిన్న విత్తులోనే పెద్ద‌ మ‌ర్రి మ్రాను దాగి ఉంది క‌దా..
ఒక్క‌ చిన్ని నీటి బిందువులోంచి స‌ముద్ర‌పు మహాఘోష‌ జ‌న్మించ‌లేదా..
ఒక్క గ‌డ్డి పోచ‌ భూమిని సైతం చీల్చుకొని త‌న‌ మ‌నుగ‌డ‌ సాగించ‌టం లేదా..
ఒక‌ చిన్ని దీప‌పు కాంతి చీక‌టిని చేదించ‌లేదా..

ఎవ‌రిలో ఏ శ‌క్తి దాగి ఉందో...
నీలో ఏ శ‌క్తి  దాగి ఉందో...

విజ‌యీభ‌వ‌
శ్రీనివాస‌ చ‌క్ర‌వ‌ర్తి.

5 comments: