ముసురు పట్టిందంటే గుండె నిండా హుషారు..
జల దారలతో కనువిందు చేసే ఇంటి చూరు..
వాన జల్లు తాకిడికి ఆకులు చేసే సవ్వడి..
నీటి పువ్వులా పుట్టించే చినుకుల జడి..
నల్లమబ్బు కప్పే నీటి చినుకులు దుప్పటి..
పెదవులకు హాయినిచ్చే పొగలు చిమ్మే టీ..
వీధుల్లో పొంగే పొరిలే పిల్ల కాలువలు..
పిల్లల చేతుల్లో జాలువారే కాగితం పడవలు..
తల్లిదండ్రుల పనికి సెలవు - పిల్లలు బడికి సెలవు.
అందరూ చేరిన ఒక చోటు ఆనందాలకు నెలవు..
- శ్రీనివాస చక్రవర్తి.
No comments:
Post a Comment