ఒక్కో రకమైన పుస్తకం ఒక్కో పరిమళాన్ని వెదజల్లుతుంది.. కొన్ని పుస్తకాలు చదువుతుంటే మన మనస్సు తెరమీద సన్నివేశాలు కదలుతూ ఉంటాయి.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.. ప్రతి పేజీ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది..
నాకు నచ్చిన పుస్తకాలు కొన్ని మీతో పంచుకొంటాను.
1.భారత జాతికి నా హితవు- వివేకానంద:
ఈ చిన్ని పుస్తకంలో ప్రతీ అక్షరం చదువుతుంటే ఏదో తెలియని ఉత్సాహం మనలో వచ్చి చేరుతుంది.ఆత్మశక్తిని, దేశభక్తిని పెంపొందించే ఈ పుస్తకం ప్రతీ భారతీయ యువతీయువకులు తప్పక చదివి తీరాలి.
2.అమరావతి కథలు - సత్యం శంకరమంచి:
తియ్యనైన తెలుగు పదాలను తేనెలో ముంచి కథలుగా రాస్తే వాటికి అందమైన బాపు బొమ్మలు జతకలిస్తే అవే అమరావతి కథలు.. తెలుగులో మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఈ కథలు చదివి తీరాల్సిందే.
3.మిథునం -శ్రీరమణ:
భార్యాభర్తలు అనురాగానికి అందమైన వర్ణన.. ఏకబిగిన మన చేత చదివించే ఈ కథ మనస్సును హత్తుకుంటుంది,
మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.
4.సత్యశోధన లేదా ఆత్మకథ- గాంధీ:
సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగిన ఒక వ్యక్తి జీవితం ఇది ఒక చరిత్ర.
నిజాయితీతో సాగిన ఈ జీవిత కథ వర్ణించిన విధానం అద్భుతం.చదువుతుంటే నిజంగానే గాంధీగారు మన పక్కన కూర్చుని కథని చెబుతున్నట్లు అనిపిస్తుంది..
5.నాకూ ఉంది ఓ కల - వర్గీస్ కురియన్:
పట్టుదలతో సాగే ఓ అధ్బుతమైన విజయగాధ. మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఎలా ఉన్నాం ,ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యం అని ఈ ఆత్మకథ చెబుతుంది..మారుమూల గ్రామాన్ని (ఆనంద్) ప్రపంచ ప్రఖ్యాత గావించిన కురియన్ ఆత్మకథ ఎంతో ప్రేరణాత్మకం.
పుస్తకాలు నా జీవితంలో భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. మరి మీకు నచ్చిన పుస్తకాల పేర్లు కూడా నాతో పంచుకుంటారు కదూ.
చదవండి - చదివించండి
శ్రీనివాస చక్రవర్తి
27/06/2019

Good to know Anna
ReplyDelete