మైదానం ఆత్మకథ
-----------------------
నా పేరు మైదానం..
వినండి నా మనసులోని అంతర్మధనం...
ఒకప్పుడు..
వేకువనే తాకే సూరీడు కిరణాలు కన్నా నా వద్దకు ముందే వచ్చి చేరేవి చిన్నారులు చిరునవ్వులు..
పూలమొక్కలు నుంచి నేలపైన రాలే సుకుమారమైన కుసుమాలు కన్నా వారి లేలేత పాదాలు ఎంతో సుతిమెత్తగా నన్ను తాకేవి...
నాపైన రాలే తొలకరి వాన జల్లు తాకిడికన్నా ఆటలో అలిసిన చిన్నారుల చెమట బిందువులు జల్లు నన్ను తాకినప్పుడు నా మట్టి గుండె పులకరించేది..
ఆటపాటల్లో సాగే చిన్నారుల కేరింతలు...
నాకు పండగలు,తిరునాళ్ళు
గెలిస్తే వాళ్ళు చేసుకునే సంబరాలు..
ఓడితే మరలా గెలవాలని చూపే పట్టుదల..
ఇన్ని భావోద్వేగాలుకు వేదిక అయినందుకు నాకు ఎంతో ఆనందం కలిగేది...
శనివారం సాయంత్రం వచ్చిందంటే వాళ్ళకన్నా నేనే ఎక్కువ ఆనందించేదానిని..
ఎందుకో ఈ పాటికి మీకు అర్థం అయ్యి ఉంటుంది...
ఎన్నో మలుపులుతో సాగే ఆటల్లో అలుపెరుగని గుండెల్లో గెలుపుకై ప్రతి తలపు....
************
కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు కధా..
పగలు వెనుక చీకటి లాగా... ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి..
ఒకప్పుడు 5 సంవత్సరాలకు బడికి వెళ్ళేవారు నేడు 2 సంవత్సరాలకే మోయలేని భారాన్ని మోస్తూ వెళుతున్నారు...
పాపం వారికి కూడా తెలియదు ఆటలు అంటే స్మార్ట్ ఫోన్తెరపైన ఆడే ఆటలు అనుకుంటున్నారు...
స్మార్ట్ తెరపైన ఉన్న చూపులు.. తీరికలేని చదువులు..
మైదానం వైపు అడుగులు పడనీయడంలేదు..
వారికి ఎవరు చెబుతారు?
మైదానంలో గెలుపోటములు రుచి చూసిన వారు జీవితంలో ఎలాంటి వెలుగు, చీకట్లను ఎదుర్కొనేంతగా దృఢంగా తయారవతారనీ..
వారికి ఎలా తెలుస్తుంది?
ఇప్పుడు నలుగురు కలిసి ఒకచోట పనిచేయలేకపోతున్నారు... చాలా పనులు ఐక్యమత్యం లోపించే పూర్తి కావడంలేదు
విజయంలో శభాష్ అని చేయి అందించే గుణం.. భాదలో నేను ఉన్నా అని భుజాన్ని తట్టే గుణం మైదానంలో గడిపిన వారికి బాగా తెలుసు అని...
మరలా ఆ రోజులు రావాలని ఆశిస్తున్నాను..
లేకపోతే కొన్ని రోజులకు మైదానాలు కనుమరుగవుతాయి...
మీరు నా మనసులో మాటను అర్థం చేసుకుంటారు కదూ...
పదండి మైదానాలు వైపు అడుగులు వేయండి... ముందు తరాలను తీసుకుని రండి...
మీ రాకకై ఎదురు చూస్తూ,
ఓ మైదానం..
-శ్రీనివాస చక్రవర్తి
11/08/2018

No comments:
Post a Comment