Saturday, 18 February 2017

నూత‌న‌ జంట‌కి క‌ళ్యాణ‌ మ‌హోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు

ఇరు హ‌ృద‌యాలు ఒక‌ హ‌ృద‌యంగా
ఇరువురి అడుగుగులు ఏడు అడుగుల‌తో జ‌త‌ ప‌డ‌గా..
అక్ష‌త‌లు ముత్యాల సిరులుగా మార‌గా....
త‌లంబ్రాలు తేనె జ‌ల్లులా కుర‌వ‌గా....
వ‌దువు సుగుణాల‌ సీత‌మ్మ‌గా
వ‌రుడు అయోద్య‌ రామ‌య్య‌గా త‌ల‌పించి
ప‌రిణ‌యమాడు శుభ‌ స‌మ‌యాన‌...

క‌ళ్యాణ‌ తోర‌ణాలు,ప‌చ్చ‌ని పందిరులు
చిన్నారుల‌ చిరున‌వ్వులు, పెద్ద‌ల‌ ఆశిస్సులు...
మేళాలు తాళాలు.. పంచ‌భూతాలు..
సాక్షిగా వ‌దువ‌రులు ఏకంకాగా...

క‌ళ్యాణ‌ ద‌ర‌హాసంతో 
నిండు నూరేళ్ళ‌ స‌హవాసంతో
మ‌ధుమాసం లోకి అడిగుడుతున్న‌

నూత‌న‌ జంట‌కి క‌ళ్యాణ‌ మ‌హోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు....

2 comments: