Thursday, 24 September 2015

గణపయ్య నీ చల్లని చూపు చాలయ్య ....

ఓ బుజ్జి గణపతి...
విఘ్నాలను తొలగించి ,విజయాలను చేకూర్చే గణాధిపతి ...
మధురమైన కుడుములు ,ఉండ్రాళ్ళు అంటే నీకు ఎంతో ప్రీతి...
నీ పూజకై ఫల పుష్ప పత్రాలను అందించి పరవశించింది ప్రకృతి ...
తల్లి తండ్రులకు ప్రదిక్షణ చేసి ముల్లోకాలను చుట్టిన నీ రీతి.....
మాత,పిత్రు దేవోభవ అన్న పదాలకు అర్ధం చూపుతూ...
ప్రపంచానికి చాటావు మన భారతీయ సంస్క్రుతి............

భారతాన్ని అధ్బుతంగా మలిచినవాడవు నీవు ..
భారతాన్ని నేను చెపుతుంటే ఆపకుండా వ్రాసేవాడు
కావాలి అన్నాడు ఆ వ్యాస భగవానుడు.....
నేను ఏమైనా తక్కువా అంటూ
నేను వ్రాయటం మొదలెడితే ఆపకుండా చెప్పేవాడు ..
కావాలి అన్నాడు నీలోని ఉత్సాహవంతుడు.........
ప్రారoభించిన కార్యాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా....
సాధించే వరకు ఆగను అన్నాడు నీలోని విక్రమార్కుడు....
అదే ఉత్సాహాన్ని, పట్టుదలను మాలో నింపి చూడు....

గణపయ్య అందుకోవయ్య మా వినతి..
అభివృదికై తపిస్తుంది మా భరతజాతి...
మాలో కొంత నింపవయ్య నీలోని జ్యోతి....
భొధించవయ్య నీ సుగుణాల నీతి ....
పూరించావయ్య ఆనందాల వెలితి ...
అందరని ఏకం చేసి చూపించు ప్రగతి..
ముల్లోకాలను తాకాలి భారత దేశపు ఖ్యాతి....

1 comment: