భారత జాతి ఆణిముత్యం కలాం ...
కలలను సాకారం చేసుకోమంది నీ గళం ..
భారత మాత సేవకై తపించింది నీలో ప్రతి కణం ...
దేశ అభివృధికి పరిశ్రమించవు అణు క్షణం ....
నీ మాటలలో ఉప్పొంగెను ఆత్మ స్థైర్యం ....
మా గుండెలలో నింపావు గుండె ధైర్యం ...
కృషితో ఋషిగా మారిన ఓ మహా వ్యక్తి ...
అంతరిక్ష రంగంలో ప్రపంచానికి చూపావు మన
శక్తీ ....
మాకు ఆదర్శం ఎవరు అంటే నిన్నే చూపింది యువత ...
కారణం అపార జ్ఞానం , సహృదయం కలబోసినా నీ నిరాడంబరత ....
ఏ నోము నోచి నిన్ను కన్నదో నీ జనని ....
నీ పాదం తాకి పరవశించింది ఈ అవని ....
నీ సందేశంతో ఉద్యమించింది యువతరం ....
మా నర నరం జపిస్తుంది వందేమాతరం ....
నీ ఆశయ సాధనకై కృషి చేస్తాం అందరం ....
వందేమాతరం .... వందేమాతరం ........
- శ్రీనివాస చక్రవర్తి .....