Saturday, 19 December 2015

తెలుగు త‌ల్లి ముద్దుబిడ్డ‌గా జ‌న్మించ‌డం ఎన్నో నోముల‌ ఫ‌లం...

తెలుగు జ‌ల‌ జ‌ల‌ పారే గోదారి జ‌లం..
తెలుగు మ‌ధుర‌మైన‌ మామిడి ఫ‌లం..
తెలుగు నేల‌ను ముద్ధాడి ప‌ర‌వ‌సించింది హ‌లం.
తెలుగు నేల‌లో సిరులు పండించు పొలం..
తెలుగు అక్ష‌రాన్ని రాసి మురిసింది క‌లం..
తెలుగు తొమ్మిది కోట్ల‌ ప్ర‌జ‌ల‌ బ‌లం...
తెలుగు వాడి వెలుగును చూసి మెరిసింది భూత‌లం...
తెలుగు ప‌దాల‌ పూదోట‌ ప‌రిమళాల‌తో నిండింది గ‌గ‌న‌ త‌లం...
తెలుగు త‌ల్లి ముద్దుబిడ్డ‌గా జ‌న్మించ‌డం ఎన్నో జన్మల  నోముల‌ ఫ‌లం...

.. వెంకోరా చ‌క్ర‌వ‌ర్తి..

Saturday, 14 November 2015

బాల్యం ఓ అంద‌మైన‌ లోకం...

పుడ‌మికి వెలుగునిచ్చే చిన్నారుల‌ చిరున‌వ్వులు....

మ‌న‌స్సును హ‌త్తుకునే ముద్దైన‌ మాట‌లు...

అంద‌మైన‌ అల్ల‌రికి ప్ర‌తిరూపం వారి ఆట‌లు...

కోయిల‌మ్మ‌కి నేర్పారు ప‌సందైన‌ పాట‌లు...

ఇసుక‌తో మ‌లిచారు అపురూప‌మైన‌ మ‌ట్టి కోట‌లు....

రేప‌టి పౌరుల‌కై  మ‌నం చూపాలి‌  బంగారు బాట‌లు..

నేటి బాల‌లే రేప‌టి పౌరులు....
భార‌తావ‌నిని అభివృద్ది శిఖ‌రాల‌కు చేర్చే ధీరులు....

        బాల‌ల‌ దినోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు
                          ‍ .. శ్రీనివాస‌ చ‌క్ర‌వ‌ర్తి

Saturday, 7 November 2015

ఒక‌ మంచి ప‌నిచేద్దాం ప‌దండీ... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు....

ఒక‌ మంచి ప‌ని చేద్దాం పదండి..

ధీర‌ పురుషుల‌ను క‌న్న భ‌ర‌త‌ ‌భూమి ఇదీ...
వీర ‌ర‌క్తం తిల‌కంగా ధిద్దిన చరిత‌ మ‌న‌దీ...
ప్ర‌తీ జీవిలో దైవాన్ని చూసిన‌ ఖ్యాతి భార‌తీయున‌ది...
వీర‌త్వం , దైవ‌త్వం నిండిన‌ ర‌క్తం నీలో ఉర‌క‌లెత్తుతుంది..
తల‌సీమియా చిన్నారుల‌కై ఉధ్య‌మించే త‌రుణ‌మిదీ.....
ర‌క్త‌ధానం చెయ్య‌వ‌ల‌సిన‌ భాద్య‌త‌ మన అంద‌ర‌దీ...
భ‌ర‌త‌మాత‌ బిడ్డగా జన్మ  ధన్యం చేయున‌దీ....

ర‌క్త‌ధానం చేద్దాం..
త‌ల‌సీమియా చిన్నారుల‌ జీవితాల‌లో వెలుగులు నింపుదాం..

ప‌దండి ఒక‌ మంచి ప‌ని చేద్దాం....
ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ....
విన‌ప‌డ‌లేదా సాటి మ‌నిషి గుండె చ‌ప్పుడూ....
        ‍ ‍    
                      .... శ్రీనివాస‌ చ‌క్ర‌వ‌ర్తి

Monday, 19 October 2015

Telugu Velugu -మ‌న‌ తెలుగు మ‌ధుర‌మైన‌ భాష...

అ - అమ్మ అను మాట‌తో మొద‌లగు భాష‌
ఆ - ఆప్యాయ‌త‌ల‌ను పంచు భాష...

ఇ - ఇలలోనె ఇంపైన‌ భాష‌....
ఈ - ఈశ్వ‌ర‌డు కుర్చినట్టి భాష‌...

ఉ - ఉత్సాహ‌ముతొ ఉర్రుత‌లూగించు భాష‌..
ఊ - ఊయ‌ల‌లా మ‌దిన ఊగించు భాష‌..
ఋ - ఋషులు,మ‌హ‌రాజులు , క‌వులు  

ఎ - ఎంద‌రొ మ‌హ‌నుబావులు కొన‌యాడిన‌ బాష‌..
ఏ - ఏక‌త్వాన్ని హ్రుద‌యంలొ నింపి..
ఐ - ఐక్య‌మ‌త్యాన్ని పెంపొదించిన‌ భాష‌....

ఒ - ఒంపు,సొంపుల‌తొ శిల్పి చెక్కిన‌ట్లుండె గుండ్ర‌టి భాష‌..
ఓ - ఓన‌మ‌లలో‌ స‌రిగ‌మ‌లు ప‌లికించిన‌ భాష....
ఔ - ఔరా,ఇది  మ‌ధురమైన‌ క‌విత్వమా లేక‌  భాషా.. అని ర‌వింద్రుడు ప్ర‌సంశించిన‌ భాష‌..

అం - అంద‌మైన‌,సుంద‌ర‌మైన‌,మ‌దుర‌మైన‌,వీనుల‌విందైన‌ భాష... మ‌న‌ తెలుగు భాష‌....

               ‍‍.. వెంకోరా చ‌క్ర‌వ‌ర్తి..

Sunday, 27 September 2015

Abdul Kalam-The great , కలాం నిన్ను ఎలా మరచిపోగలం .....

భారత జాతి ఆణిముత్యం కలాం ...
కలలను సాకారం చేసుకోమంది నీ గళం ..

భారత మాత సేవకై తపించింది  నీలో ప్రతి  కణం ...
దేశ అభివృధికి  పరిశ్రమించవు అణు క్షణం ....

నీ మాటలలో ఉప్పొంగెను ఆత్మ స్థైర్యం ....
మా గుండెలలో నింపావు గుండె ధైర్యం ...

కృషితో ఋషిగా మారిన ఓ మహా వ్యక్తి  ...
అంతరిక్ష రంగంలో ప్రపంచానికి చూపావు మన 
శక్తీ ....    

మాకు  ఆదర్శం ఎవరు అంటే  నిన్నే చూపింది యువత ...
కారణం  అపార  జ్ఞానం , సహృదయం కలబోసినా నీ నిరాడంబరత ....

ఏ నోము నోచి  నిన్ను కన్నదో  నీ జనని ....
నీ పాదం  తాకి పరవశించింది ఈ అవని ....

నీ సందేశంతో ఉద్యమించింది యువతరం ....
మా నర నరం జపిస్తుంది వందేమాతరం ....
నీ ఆశయ సాధనకై కృషి చేస్తాం అందరం ....
వందేమాతరం .... వందేమాతరం ........

                            - శ్రీనివాస చక్రవర్తి .....

Thursday, 24 September 2015

I love my India.. First song I written.... Ee dhesam mana dhesam antu veligethi nuvu padara


Rakhee -అన్న చెల్లెలా అనుభందాల పండుగ ....


గణపయ్య నీ చల్లని చూపు చాలయ్య ....

ఓ బుజ్జి గణపతి...
విఘ్నాలను తొలగించి ,విజయాలను చేకూర్చే గణాధిపతి ...
మధురమైన కుడుములు ,ఉండ్రాళ్ళు అంటే నీకు ఎంతో ప్రీతి...
నీ పూజకై ఫల పుష్ప పత్రాలను అందించి పరవశించింది ప్రకృతి ...
తల్లి తండ్రులకు ప్రదిక్షణ చేసి ముల్లోకాలను చుట్టిన నీ రీతి.....
మాత,పిత్రు దేవోభవ అన్న పదాలకు అర్ధం చూపుతూ...
ప్రపంచానికి చాటావు మన భారతీయ సంస్క్రుతి............

భారతాన్ని అధ్బుతంగా మలిచినవాడవు నీవు ..
భారతాన్ని నేను చెపుతుంటే ఆపకుండా వ్రాసేవాడు
కావాలి అన్నాడు ఆ వ్యాస భగవానుడు.....
నేను ఏమైనా తక్కువా అంటూ
నేను వ్రాయటం మొదలెడితే ఆపకుండా చెప్పేవాడు ..
కావాలి అన్నాడు నీలోని ఉత్సాహవంతుడు.........
ప్రారoభించిన కార్యాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా....
సాధించే వరకు ఆగను అన్నాడు నీలోని విక్రమార్కుడు....
అదే ఉత్సాహాన్ని, పట్టుదలను మాలో నింపి చూడు....

గణపయ్య అందుకోవయ్య మా వినతి..
అభివృదికై తపిస్తుంది మా భరతజాతి...
మాలో కొంత నింపవయ్య నీలోని జ్యోతి....
భొధించవయ్య నీ సుగుణాల నీతి ....
పూరించావయ్య ఆనందాల వెలితి ...
అందరని ఏకం చేసి చూపించు ప్రగతి..
ముల్లోకాలను తాకాలి భారత దేశపు ఖ్యాతి....