Monday, 30 January 2017

పాట - కనిపించే దైవాలను తొలిసారి దర్శించిన రోజు.. ఈ పుట్టిన రోజు

తొలి శ్వాస పీల్చిన రోజు...
అందాల లోకాన్ని చూసిన రోజు..
అమ్మ ఒడిలో ఒదిగన రోజు...
నాన్న మదిపై మురిసిన రోజు...
ఈ పుట్టినరోజు.. 


భువిపైన తొలిసారి శ్వాస పీల్చిన రోజు..
అందాల లోకంలో అడుగిడిన రోజు.. 2

అమ్మ ఒడిలోన, గుండె సడిలోన
నాన్న మదిలోన,ఆనంద భాష్పాల కంటతడిలోన తడిసిన మురిసన రోజు.. ఈ పుట్టినరోజు..
కనిపించే దైవాలను తొలిసారి దర్శించిన రోజు.. ఈ పుట్టిన రోజు (2)

(ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోకి వచ్చాడు అంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో కోలాహలంగా మారుతుందో)

మాలో ఒకరొచ్చారని.. 
కలలెన్నో తెచ్చారని... 
ఆత్మీయులు,బందువులు పండుగలు వేడుకలు 
చేసుకునే రోజు ఈ పుట్టిన రోజు...

(మరి నువ్వు మంచిస్థాయికి ఎదగాలి అని అందరూ ఆశిస్తారు కదా)

హిమశైల శిఖరంలాగా...
ఆ నీలి గగనం దాకా... 
నువ్వు ఎదగాలని.. కీర్తి పొందాలని...(2)
అందరి ఆశిస్సులను అందించే రోజు ఈ పుట్టినరోజు.. ..

(సృష్టిలో అన్ని జీవరాశులలో ఉన్నతమైన జీవరాశి మానవడు.. అటువంటి జన్మని సార్థకం చేసుకోవాలి..నువ్వు ఒక మంచిస్ధాయికి చేరి ,పది మందిని అక్కడికి తీసుకెళ్ళాలి)

ఒక దీపం పది దీపాలలో వెలుగు నింపినట్లుగా..
ఒక పుష్పం వికసించి ఆ ప్రదేశాన్ని సుమగంధం అద్దినట్లుగా..
ఒక మేఘము వర్షించి భూమిని సస్యశ్యామలం చేసినట్లుగా...
ఒక నది ప్రవహంచి దాహాన్ని తీర్చునట్లగా..

ఒక మంచి సంకల్పంతో ముందుకు సాగాలి