Saturday, 19 December 2015

తెలుగు త‌ల్లి ముద్దుబిడ్డ‌గా జ‌న్మించ‌డం ఎన్నో నోముల‌ ఫ‌లం...

తెలుగు జ‌ల‌ జ‌ల‌ పారే గోదారి జ‌లం..
తెలుగు మ‌ధుర‌మైన‌ మామిడి ఫ‌లం..
తెలుగు నేల‌ను ముద్ధాడి ప‌ర‌వ‌సించింది హ‌లం.
తెలుగు నేల‌లో సిరులు పండించు పొలం..
తెలుగు అక్ష‌రాన్ని రాసి మురిసింది క‌లం..
తెలుగు తొమ్మిది కోట్ల‌ ప్ర‌జ‌ల‌ బ‌లం...
తెలుగు వాడి వెలుగును చూసి మెరిసింది భూత‌లం...
తెలుగు ప‌దాల‌ పూదోట‌ ప‌రిమళాల‌తో నిండింది గ‌గ‌న‌ త‌లం...
తెలుగు త‌ల్లి ముద్దుబిడ్డ‌గా జ‌న్మించ‌డం ఎన్నో జన్మల  నోముల‌ ఫ‌లం...

.. వెంకోరా చ‌క్ర‌వ‌ర్తి..